Corona Guidelines: కరోనా చికిత్స కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం..!

Corona Guidelines: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న ధరలు కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ మునుపటి వేరే గంటలకంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా పరీక్షలు వేగవంతం చేసి పాజిటివ్ వచ్చినవారికి హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఏప్రిల్ 1 నుండి 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు వేగవంతం చేసి రిజల్ట్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ఈ లక్షణాల తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్ లేదా కరోనా చికిత్స కేంద్రానికి వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
*కేంద్రం జారీచేసిన కరోనా చికిత్స మార్గదర్శకాలలో కరోనా సోకిన వారికి స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వకూడదని, వాటివల్ల బ్లాక్ ఫంగస్,మ్యూకోర్మైకోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం సూచించింది.

*కరోనా లక్షణాలు ఉన్నవారికి RT-PCR పరీక్షలు వేగంగా నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి హోమ్ ఐసోలేషన్ ఉంచి చికిత్స అందించాలి. వారికి కాంటాక్ట్ లో ఉన్నవారిని ట్రేస్ చేసి వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలి.
*కరోనా లక్షణాల తీవ్రతను బట్టి లక్షణాలు తేలికపాటి గా ఉంటే ఇంట్లో ఉంచి చికిత్స అందించాలి.కరోనా లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉండి ఆక్సిజన్ తీసుకోవటంలో ఇబ్బంది పడే వారికి వెంటనే ఆస్పత్రికి తరలించాలని, వారికి రెమెడెసివిర్ డ్రగ్ అందించవచ్చని కేంద్రం సూచించింది.
*లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి 48 గంటల లో
టోసిలిజుమాబ్ డ్రగ్‌ను ఇచ్చి ఆక్సిజన్ సదుపాయం ఉన్న గదికి వెంటనే తరలించాలి.
*బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించి ,భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.