Prabhas: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ప్రభాస్ చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే… నిజంగానే రాజువయ్యా?

Prabhas: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రభాస్ ఒకరు. ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. ఇలా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే రకం అనే సంగతి మనకు తెలిసిందే. ఇటీవల వరుసగా మూడు నాలుగు హీట్ సినిమాలు వస్తేనే తానే తోపు అని ఫీల్ అయ్యే హీరోలు ఉన్న ఈరోజుల్లో ప్రభాస్ మాత్రం ఎలాంటి గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ ఉంటారు.

ఇలా ప్రభాస్ మంచితనం గురించి ఆయన ఇతరులకు సహాయపడే విధానం గురించి ఇదివరకు ఎంతోమంది చెప్పారు. ఇక ప్రభాస్ ఎవరికైనా సహాయం చేస్తున్నారు అంటే ఆయన కుడి చేతితో చేసే సహాయం తన ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తుంటారు. ఏదైనా చిన్న సహాయం చేస్తే దాని ఒక పెద్ద పబ్లిసిటీగా చెప్పుకునే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ప్రభాస్ మాత్రం తాను చేసిన సహాయాలను అప్పుడే మర్చిపోతారు.

తాజాగా ప్రభాస్ చేసిన ఓ సాయం గురించి సినీ రచయిత తోట ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ తనకు చేసిన గొప్ప సహాయం గురించి బయటపెట్టారు. 2010 ఫిబ్రవరిలో నేను అనారోగ్యానికి గురయ్యాను ఆ రోజు నాకు సర్జరీ చేస్తే తప్ప నేను ఈరోజు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు అయితే సర్జరీకి అవసరమయ్యే డబ్బు నా దగ్గర లేదు. ఈ విషయం ప్రభాస్ కి తెలియడంతో ఆయన నా సినిమాకు రచయితగా పనిచేశారని నాకు డబ్బు పంపించడం వల్లే నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానని తెలిపారు.

నేను ఏ రోజైతే హాస్పిటల్ లో చేరానో అదే రోజే ప్రభాస్ తండ్రి గారు మరణించారు ఇలా తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఈయన నా ప్రాణాలను కాపాడటం కోసం డబ్బులు పంపించారు అంటూ ప్రభాస్ చేసిన సహాయం గురించి తెలియజేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు విన్న అభిమానులు నువ్వు నిజంగా చాలా గొప్పోడివయ్యా… అంటూ కామెంట్లు చేస్తున్నారు.