ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ పదవి నుంచి నమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేయడం..ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం అక్కడా నిమ్మగడ్డకు అనుకూలంగా వాదనలు బలంగం వినిపించడం జరిగింది తెలిసిందే. అయితే దీనిపై ఇంకా సుప్రీం తుది తీర్పు వెల్లడించలేదు. హైకోర్టును ప్రభుత్వం ధిక్కరించిందని మరోసారి నిమ్మగడ్డ హైకోర్టు గుమ్మం తొక్కడంతో ఈసారి నేరుగా గవర్నర్ కే కోర్టు సిఫార్స్ చేసింది. నిమ్మగడ్డను ఏపీ గవర్నర్ ను కలవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమై వినతి పత్రం కూడా సమర్పించారు.
ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ పంపారు. దీంతో జగన్ సర్కార్ కి బింగ్ పంచ్ పడినట్లు అయింది. ఈసారి గవర్నర్ సిఫార్స్ ను తప్పక ప్రభుత్వం పాటించక తప్పేలా లేదు. మరి గవర్నర్ సిఫార్స్ పై కూడా న్యాయపరంగా ముందుకు వెళ్తుందా? లేదా? ఈ వివాదానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెడుతుందా? అన్నది చూడాలి.
ఇప్పటికే సుప్రీంకోర్టు లో స్టే ఉందని…ఆ కోర్టు తీర్పునే హైకోర్టు ధిక్కరించిందని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో పిల్ కూడా దాఖలు చేసింది. దానిపై ఇంకా విచారణ జరగలేదు. ఈ శుక్రవారం విచారణకు వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే హైకోర్టు నుంచి నేరుగా నిమ్మగడ్డ గవర్నవర్ వద్దకు వెళ్లిపోవడం…అక్కడ నుంచి జాయినింగ్ ఆర్డర్స్ తెచ్చుకోవడం అంతా చాలా వేగంగా జరిగిపోయింది. మరి దీనిపై జగన్ సర్కార్ న్యాయ పరంగా ఎలా ముందుకు వెళ్తుంది? జగన్ తన పంతం నెగ్గించుకుంటారా? లేదా? అన్నది చూడాలి.