గాసిప్స్ : పవన్ “హరిహర వీరమల్లు” పై షాకింగ్ రూమర్స్ వైరల్.!

harihara veeramallu

Hari Hara Veeramallu : టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ ఇప్పుడు పలు సినిమాలు అలాగే తన రాజకీయ పార్టీ జనసేన లో బిజీగా ఉంటున్నాడు. అయితే వాటిని బ్యాలన్స్ చేస్తూనే పవన్ సినిమాలు చేస్తుండగా ఇప్పుడు అయితే సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్టే అనిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా తన సినిమాల్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న ప్రతిష్టాత్మకంగా చేసిన చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. ఈ సినిమాని దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే చాలా స్లోగా షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ ఇస్తూ చేస్తున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ రూమర్స్ మరియు గాసిప్ లు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ఆ

గిపోయిందని ఒక వార్త ప్రచారం అవుతుండగా దీనిపై అయితే క్లారిటీ వినిపిస్తుంది. ఈ మాటలో అయితే ఎలాంటి నిజం లేదట. సినిమా ఆలస్యం కావడానికి పవన్ తో పాటు ఇతర కొంతమంది కీలక నటులు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణమట.

ఇది తప్ప సినిమా అయితే ఆగిపోలేదని ఈ సినిమాని మేకర్స్ పూర్తి చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.