శృంగారాన్ని ఆస్వాదించాలంటే..! ఇవి తప్పనిసరి అంటున్న నిపుణులు

శృంగారం మనిషి జీవితంలో ఒక భాగం. స్త్రీ, పురుషులిద్దరు ఒకరికొకరు అర్ధం కావడంలో కూడా శృంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనసుతో మాట్లాడుకునేందుకు శృంగారం సమయమే ఉత్తమం అని అంటారు. శృంగారంలో పాల్గొనేటప్పుడు ప్రతి విషయం నాకు తెలుసు అనుకోవడం తప్పు. శృంగారం జరిపే విషయంలో భార్యాభర్తల మధ్య ఎంతో అవగాహన ఉండాలి. శృంగారం గురించి అందరికీ అవగాహన మాత్రమే ఉంటుందని.. అందులోని లోతు తెలిసినవారు ఎవరూ ఉండరనేది నిపుణుల అభిప్రాయం.

శృంగారానికి ముందు ఒకరికొకరు మాట్లాడుకుంటే ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. చక్కటి శృంగారానికి నాంది పలుకుతుంది. నాకంతా తెలుసనే ఆలోచన నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. పుస్తకాలు, ఇంటర్నెట్ లో దొరికే సమాచారం అంతా వాస్తవికతలో సాధ్యం కాదనే అభిప్రాయానికి రావొచ్చు. అవగహనతో శృంగారం జరిపేందుకు భార్యాభర్తలకు మంచి అవకాశం ఏర్పడుతుంది. రతి క్రీడలో ఉద్వేగం ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరం మొత్తం ప్రతిస్పందిస్తుంది. రతిక్రీడ జరిగే విధానం, స్త్రీ పురుషుల పరస్పర ప్రతిస్పందనలు కూడా పురుషుడి స్ఖలనంకు కారణమై ఆనందం పొందుతారు.

స్ఖలనం ద్వారానే పురుషుడు భావప్రాప్తి పొందుతారనేది ఒక అపోహ అంటున్నారు నిపుణులు. ముందే చెప్పినట్టు స్త్రీ, పురుషులిద్దరి మధ్య మంచి శృంగారం జరగడానికి పరస్పరం మాట్లాడుకోవడం మరింత ముఖ్యం అంటున్నారు. ఎంత ఆనందంగా, సంతోషంగా శృంగారానికి రెడీ అవుతారో అంత బాగా ఇద్దరికీ శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వారిద్దరి కెమిస్ట్రీనే శృంగారం స్థాయికి కొలమానం అవుతుందని అంటున్నారు. రఫ్ శృంగారం జోలికి వెళ్లకపోవడమే మంచిదని కూడా అంటున్నారు. అదంతా ప్రాక్టికాలిటీలో కష్టమనే అంటున్నారు.

మంచి శృంగారానికి మంచి ఆహారం కూడా అవసరం. కొలెస్ట్రాల్ శృంగార కాంక్షను చంపేస్తుందని, అంగస్తంభన సమస్యలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. భావప్రాప్తిలో ఎక్కువసేపు కలిగితే వీర్య ఉత్పత్తి ఎక్కువగా, నాణ్యతగా ఉండి సంతానోత్పత్తికి అవకాశం ఉంటుంది. విచ్చలవిడి శృంగారం చేసేవారి కంటే.. ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొనేవారు, స్ఖలనం చేసుకునేవారిలో నాణ్యత గల వీర్యం ఉంటుందని నిపుణులు అంటున్నారు.