జగన్ ఫేవరెట్ వైజాగ్ నుంచి జగన్ కి బ్లాక్ బస్టర్ న్యూస్?

good news to ap cm ys jagan from vizag

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం వైజాగ్ ను ఫోకస్ చేస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఉత్తరాంధ్రను అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడూ ఏపీ రాజకీయాలు విజయవాడ, గుంటూరు, కృష్ణా చుట్టూనే తిరుగుతూ ఉండేవి. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ ఫోకస్ ను డైరెక్ట్ గా వైజాగ్ కు మార్చింది.

good news to ap cm ys jagan from vizag
good news to ap cm ys jagan from vizag

ఇప్పటికే విశాఖను పాలనా రాజధానిగా మార్చింది వైసీపీ ప్రభుత్వం. పాలనా పరమైన విషయాలన్నీ వైజాగ్ నుంచి జరుగుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు పారిశ్రామిక రాజధానిగా వైజాగ్ ను చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

దాని కోసమే వైజాగ్ లో పారిశ్రామిక సదస్సును నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. విశాఖలో పారిశ్రామిక పెట్టుబడులకు ఆహ్వానించింది. పారిశ్రామికవేత్తలు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే.. ఏపీ ప్రభుత్వం నుంచి సాయం కూడా అందిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో ఏపీకి పెట్టుబడులు రాలేదని… వైజాగ్ పరిశ్రమలకు అనుగుణంగా ఉన్నా కూడా ఒక్క కంపెనీని కూడా గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని.. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వైజాగ్ ను పారిశ్రామిక రాజధానిగా చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

అంతే కాదు… విదేశీ పెట్టుబడుల కంటే కూడా లోకల్ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. లోకల్ పెట్టుబడులు ఎక్కువగా వస్తే… తర్వాత దేశీయ, విదేశీ పెట్టుబడులు అవే వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

విశాఖను ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడమే కాకుండా… దాన్ని టైర్ వన్ సిటీగా ఏపీలో అభివృద్ధి చేయడం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

అలాగే.. విశాలో ఇండస్ట్రియల్ అనుమతుల కోసం.. ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించామని.. రాయతీలు కూడా ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే… సీఎం జగన్ కు ఇక తిరుగు ఉండదు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.