మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఇచ్చే స్కీమ్స్ పై దృష్టి పెడుతూ ఉంటారు. రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ ఒక ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని దాచుకోవాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఒక్కో స్కీమ్ ఒక్కో తరహా బెనిఫిట్స్ ను అందిస్తుందనే సంగతి తెలిసిందే. కొన్ని స్కీమ్స్ ద్వారా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉండగా మరికొన్ని స్కీమ్స్ ద్వారా తక్కువ మొత్తం వడ్డీ లభించే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా ఈ స్కీమ్ లో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలంతో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అమలవుతుందనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ పై 6.2 శాతం వడ్డీ రేటు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి మూడు నెలలకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సంబంధించి వడ్డీ చేరుతుంది.
ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే అవకాశం ఉండటం వల్ల ఈ స్కీమ్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదిస్తే ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే మొత్తంపై లోన్ కూడా పొందవచ్చు. నెలకు 6,000 రూపాయల చొప్పున పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 10 లక్షల రూపాయలు పొందవచ్చు. రోజుకు 200 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.