ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే ప్రభాస్ విషయం లో ఫాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు. చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నా కూడా ఏ సినిమా గురించి చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం లేదు.

ప్రభాస్ మొదటి బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే చాలా కాలం అయింది. ఈ ఆగష్టు లో సినిమా రిలీజ్ అవ్వాలి, కానీ కరోనా వల్ల షూటింగ్ డిలే అయ్యింది. ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని కూడా చాలా రోజులు అయింది, కానీ సినిమా నుండి కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రాలేదు.

ఎన్ని పండ‌గ‌లు వ‌చ్చినా, ప్ర‌భాస్ పుట్టిన‌రోజులు ఎన్ని వెళ్లిపోయినా – ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆదిపురుష్’ టీం ప్రభాస్ ఫస్ట్ లుక్ ని అక్టోబర్ 2  రిలీజ్ చెయ్యడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

ప్రభాస్ రాముడిగా, కృతి సనాన్ సీత గా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కి రెడీ గా ఉంది.