ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఅర్సీ నివేదిక విడుదల !

cm kcr file photo

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పీఅర్సీ నివేదిక విడుదల అయింది. తొలి వేతన సవరణ నివేదికను పీఅర్సీ నివేదికను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీని ప్రకారం ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును ప్రతిపాదించింది. అంతేకాకుండా కనీస వేతనం రూ. 19 వేలుగా.. గరిష్ట వేతనం రూ. 1.62 లక్షలుగా ఉండాలని పీఅర్సీ రిపోర్ట్ పేర్కొంది.

ఉద్యోగులపై వరాల జల్లు.. పీఆర్సీ ప్రతిపాదనలు ఇవే.. ఫిట్‌మెంట్ ఎంతంటే..?

అటు హెచ్‌ఆర్‌ఏను 30 శాతం నుంచి 24 శాతానికి కుదించింది. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. కాగా, ఈ అంశంపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాలు భేటి కానున్నాయి. ఉద్యోగుల సమస్యలతో పాటు పీఆర్సీ నివేదికపైనా ఇరు వర్గాలు చర్చించనున్నాయి.

పీఆర్సీ చేసిన ప్రతిపాదనలు:

మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌

ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు

ఉద్యోగం గరిష్ఠ వేతనం రూ. 1,62,070

ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు

గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు

శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు

హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు

సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు