నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ సంస్థ బెనిఫిట్ కలిగేలా చేసింది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ntpc.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. వయోపరిమితి, అర్హత, దరఖాస్తు ప్రక్రియ, జీతం ఇతర వివరాలను తెలుసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం 300 రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇతర అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ లో డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి ఆధారంగా సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఇంటర్వ్యూ, పత్రాల ధృవీకరణ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 90,000 రూపాయల వేతనం ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వ్యక్తి జీవిత భాగస్వామికి వసతి, నైట్ షిఫ్ట్ వినోద భత్యం మరియు వైద్య సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది.