మ‌న పాల‌న‌-మీ సూచ‌న ఓ మంచి కార్య‌క్ర‌మం

 ఏడాదిలో ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌, అభివృద్ధి, సంక్షేమ కార్యక‌లాపాల‌పై ఈనెల 25 వ‌తేదీ నుంచి 29 వ‌ర‌కూ `మ‌న పాల‌న‌- మీ సూచ‌న‌` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌ణాళిక ఎక్స్ అఫిషియో కార్య‌ద‌ర్శి విజ‌య్ కుమార్ తెలిపారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష మేర‌కు ఏర్ప‌డిన ఈ ప్ర‌భుత్వం వారి ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు నిరంత‌రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ ముందుకెళ్లాల‌నే దృక్ఫ‌థంతో దీన్ని త‌ల‌పెట్టిన‌ట్లు విజ‌య్ కుమార్ తెలిపారు. సంక్షేమ ప‌థ‌కాలు, వాటి అమ‌లు తీరుపై నేరుగా ల‌బ్ధిదారుల‌తో పాటు, ముఖ్య నేత‌లు, వివిధ రంగాల్లో నిపుణ‌ల‌తో ఇష్టాగోష్టి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. కొవిడ్ -19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని 50 మందికి మించ‌కుండా పాల్గొన‌ల‌ని సూచించారు.

ఇందులో తాడేప‌ల్లి నుంచి ముఖ్య‌మంత్రి పాల్గొంటార‌ని   అధికారుల‌కు తెలిపారు. ప్ర‌తి రోజు మ‌ధ్నాహ్నం 2.30 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కూ స‌మీక్ష ఉంటుంద‌ర‌న్నారు. అనంత‌రం ప్ర‌తి జిల్లా నుంచి నివేదిక‌లు తెప్పించుకుని వాటిని క్రోడిక‌రించి.ల‌క్ష్యాలు రూపొందిస్తామ‌న్నారు. అలాగే ఈనెల 30 రైతు భ‌రోసా కేంద్రాల ప్రార‌భం ఉంటుంద‌ని తెలిపారు. జ‌గ‌న్ పాల‌న ఏడాది పూర్తియ‌న సంద‌ర్భంగా త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల వైకాపా మంత్రులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేసారు.

ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను..సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందుతున్నాయా?  లేదా? అని తెలుసుకోవ‌డానికి ఇది మంచి వేదిక అవుతుంద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ఏవైనా లోపాలు ఉంటే?  వాటిని స‌రిద్దిద్దుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని, నేరుగా ల‌బ్దిదారుడే మాట్లాడుతాడు కాబ‌ట్టి స‌మ‌స్య నేరుగా ఉన్న‌త అధికారుల‌తో పాటు, సీఎం దృష్టికి వెళ్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏడాదికి ఒక‌సారి పాల‌న పై రివ్యూ చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో విష‌యాలు తెలుస్తాయ‌ని..లంచాలు స‌హా ప‌లు ప్ర‌జ‌లు ఇబ్బందిని త్వ‌రిగతిన గుర్తించ‌వ‌చ్చాన్నారు. త‌ద్వారా అవినీతికి పాల్ప‌డే అధికారులు దొర‌క‌బెట్టొచ్చ‌ని పేర్కొన్నారు.