Gold Price: భగ్గుమంటున్న బంగారం ధరలు!

gold

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర.. ఏకంగా రూ.400 పెరిగి రూ.49,000లకు చేరుకుంది. ఇక 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.430 పెరిగి..రూ.53,450కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు న్యూఢిల్లీ ముంబై, కోల్‌కతా, బెంగళూరులో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.400 పెరిగి..రూ.72,700కి చేరింది. ఇక్కడ తులం వెండి రేటు రూ.727కి పెరిగింది.