పెరిగిన బంగారం ధర.. దూసుకుపోతున్న వెండి

gold

పసిడి రేటు పరుగెడుతోంది. నిన్న దిగి వచ్చిన బంగారం ధర ఈరోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 640 పెరిగి రూ. 52,310కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ. 47,950కు ఎగసింది. ఇక వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. KGపై రూ.900 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ Silver రూ. 72,800కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.