‘ఆచార్య’ లాంటి డిసాస్టర్ తర్వాత చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ పైనే అందరి ఆశలు ఉన్నాయి. అయితే డైరెక్టర్ మోహన్ రాజా ఎప్పుడో తెలుగు లో ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమా తీసాడు. ఆ తర్వాత తన తమ్ముడు ‘జయం’ రవి తో తమిళ్ లో చాలానే సినిమాలు చేసాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు లో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ మీద చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ టీం మాత్రం మూవీ హిట్ అవుతుందని ధీమాగా ఉంది.
ఈ సినిమాకి గట్టి ఓటిటి పోటీ పలు ప్లాట్ ఫామ్స్ మధ్య నెలకొనగా ఫైనల్ గా అయితే ఈ చిత్రాన్ని ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారని బజ్ వినిపిస్తుంది. మరి ఇది ఒక్క తెలుగు వెర్షన్ వరకు మాత్రమేనా లేక హిందీలో కూడానా అనేది తెలియాల్సి ఉంది.
మోహన్ లాల్ ‘లూసిఫెర్’ కి రీమేక్ గా వచ్చిన సినిమాకు ఇది తెలుగు రీమేక్. అయితే ‘లూసిఫెర్’ తెలుగు డబ్ వెర్షన్ కూడా ప్రైమ్ లో ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా చూసారు. మరి చిరంజీవి ధైర్యం చేసి మరీ ఈ సినిమాను రీమేక్ చేసారు. రిసల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.