బిగ్ న్యూస్ : ‘జనసేన’ పుట్టుకపై “గాడ్ ఫాదర్” నిర్మాత సంచలన కామెంట్స్.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మెగా హీరోలు కానీ మెగా కుటుంబం కోసం గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోలుగా ఎంత ఎదిగారో పర్సనల్ గా కూడా అంతే స్థాయిలో చితికిపోయారు. మెగాస్టార్ చిరంజీవి సహా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా తెలుగులో భారీ క్రేజ్ ఉన్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

అయితే నిన్న గాడ్ ఫాదర్ హిట్ ఈవెంట్ లో మెగా ఫామిలీ తో ఎప్పుడు నుంచో ట్రావెల్ అవుతూ ఇప్పుడు గాడ్ ఫాదర్ నిర్మాతగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఎన్ వి ప్రసాద్ కొన్ని సంచలన కామెంట్స్ చేయడం సినీ సహా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చివరి రోజుల్లో చిరు తన ఆస్తులు అమ్మి అప్పులు తీర్చారని అయినా కూడా ఇప్పటికీ  ఆయనపై ఏవోక కామెంట్స్ చేస్తూనే ఉన్నారని అయినా ఆయన మాత్రం చిరు నవ్వు తోనే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనని ఏమన్నా ఊరుకుంటాడు కానీ తన అన్నయ్యని ఏమన్నా అంటే రోడ్డు మీదికి వచ్చి కూర్చునే మనిషి అని చెప్పారు.

అంతే కాకుండా ఆ నాడు ప్రజా రాజ్యం లో నుంచి పుట్టిన ఆ బాధ, ఆవేశం మూలానే పవన్ జనసేన పార్టీ కూడా పుట్టింది. పవన్ కళ్యాణ్ ఆ పార్టీని స్థాపించాడు అంటూ సంచలన కామెంట్స్ చేయడం సినీ రాజకీయ వర్గాలను హీటెక్కిస్తోంది.