తెలంగాణ టీఆర్ఎస్‌ మంత్రికి జీహెచ్ఎంసీ బిగ్ షాక్‌..!

ghmc imposes fine on icon digital media for minister talasani flexi

ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులకు సాధారణంగా వాళ్ల పుట్టిన రోజు నాడు.. స్పెషల్ అకేషన్స్ అప్పుడు వాళ్ల ఫోటోలతో ఫెక్సీలు కట్టి వాళ్లకు శుభాకాంక్షలు తెలపడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. ఎవరైనా ప్రముఖ హీరో పుట్టిన రోజు ఉంటే.. ఆయన ఫెక్సీలను కట్టి ఆయనకు తన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఎవరైనా బడా రాజకీయ నాయకులైనా కూడా అంతే. వాళ్లకు కూడా తమ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడుతారు.

ghmc imposes fine on icon digital media for minister talasani flexi
ghmc imposes fine on icon digital media for minister talasani flexi

అదే ప్రస్తుతం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తలనొప్పి తెచ్చింది. తెలంగాణ మంత్రి అయినప్పటికీ.. ఆయనకు జీహెచ్ఎంసీ బిగ్ షాక్ ఇచ్చింది.

అసలు ఏం జరిగిందంటే… మంత్రి తలసాని పుట్టిన రోజు సందర్భంగా… ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ghmc imposes fine on icon digital media for minister talasani flexi
ghmc imposes fine on icon digital media for minister talasani flexi

అయితే.. పర్మిషన్ తీసుకోకుండా.. నిబంధనలను ఉల్లంఘిస్తూ మంత్రి ఫెక్సీలను ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సీలను అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారంటూ మండిపడింది.

ఫ్లెక్సీలను హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేసిన ఐకాన్ డిజిటల్ మీడియా సంస్థకు జీహెచ్ఎంసీ 3 లక్షల రూపాయల ఫైన్ వేసింది. వెంటనే ఆయా ఫ్లెక్సీలను తొలగించాలంటూ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.