గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి వెల్లడించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న పార్థసారధి.. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లను నవంబర్ 18, 2020 నుంచి ప్రారంభించనున్నారు. డిసెంబర్ 1, 2020 న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 4 డిసెంబర్, 2020న వెలువడనున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. తుది ఓటర్ల జాబితాను, పోలింగ్ స్టేషన్ల ముసాయిదా, ఎన్నికల పరిశీలకుల నియామకాలను కూడా ఈసీ చేపట్టింది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబిత ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 74 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం 9248 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేయనుంది.