గ్రేటర్ ఫలితాలు : సత్తా చాటుతున్న బీజేపీ… 23 చోట్ల ఆధిక్యం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీ తలపడిన ఈ పోరులో అంతిమ విజయం ఎవరిదనేది మరి కొద్దిసేపట్లో తేలనుంది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది.

పోలింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది చేరుకొని తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల లెక్కింపు జరుపనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటివరకు జరిగిన లెక్కింపును బట్టి బీజేపీ 23 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ ఆరు డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇతర పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు.

ఇక గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో గచ్చిబౌలి డివిజన్ లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్టు కాగా ఒకటి టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. మిగిలిన డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ వివరాలని ఒకసారి చూస్తే …

నాగోల్ డివిజన్‌ : బీజేపీ 13, టీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 1
బేగంబజార్ డివిజన్‌ : బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 1
హయత్‌నగర్‌ డివిజన్‌ : బీజేపీ 8, టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1, టీడీపీ 1
బోయిన్‌పల్లి డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 7
హైదర్‌నగర్‌ డివిజన్‌ : బీజేపీ 3, టీఆర్ఎస్‌ 1, టీడీపీ 1
భారతీనగర్‌ డివిజన్‌ : బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
గచ్చిబౌలి డివిజన్‌ ‌: టీఆర్‌ఎస్‌ 1, చెల్లనివి 2
వనస్థలిపురం డివిజన్‌ : బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
చంపాపేట్‌ డివిజన్‌ : బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
సరూర్‌నగర్‌ డివిజన్‌లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు
శేరిలింగంపల్లి డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 3
లింగోజీగూడ డివిజన్‌ : బీజేపీ 5, కాంగ్రెస్‌ 3, టీఆర్‌ఎస్‌ 1
హస్తినాపురం డివిజన్‌ : బీజేపీ 2
పటాన్‌చెరు డివిజన్‌ టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
కూకట్‌పల్లి డివిజన్‌ : బీజేపీ 24, టీఆర్‌ఎస్‌ 21, టీడీపీ 2, నోటా 2
సూరారం డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1, చెల్లనివి 2
గాజులరామారం డివిజన్‌ : బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
అల్వాల్‌ డివిజన్‌ ‌: బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 6, నోటా1, చెల్లనివి 23
జీడిమెట్ల డివిజన్‌ : బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 4, చెల్లనివి 1
సుభాష్‌నగర్‌ డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 3
కొండాపూర్ డివిజన్‌ : బీజేపీ 5
అల్లాపూర్‌ డివిజన్‌ : బీజేపీ 3
మూసాపేట్‌ డివిజన్‌ : బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1
ఫతేనగర్‌ డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 1
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ : బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2
బాలాజీనగర్‌ డివిజన్‌ బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
మన్సూరాబాద్‌ డివిజన్‌ : బీజేపీ 8, టీఆర్‌ఎస్‌ 5
కవాడీగూడ డివిజన్‌ : బీజేపీ 10, టీఆర్‌ఎస్‌ 1, టీడీపీ 1
నాగోల్‌ డివిజన్‌ : బీజేపీ 13, టీఆర్ఎస్‌ 12, కాంగ్రెస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
మాదాపూర్‌ డివిజన్‌ : బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మియాపూర్‌ డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
హఫీజ్‌పేట డివిజన్‌ : బీజేపీ 4
చందానగర్‌ డివిజన్‌ : బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మూసాపేట డివిజన్‌ : బీజేపీ 15, టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 1
బాలానగర్‌ డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
జగద్గిరిగుట్ట డివిజన్‌ : బీజేపీ 1, టీఆర్‌ఎస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 20, బీజేపీ 14
మల్కాజ్‌గిరి డివిజన్‌ : బీజేపీ 5, టీఆర్ఎస్‌ 1
బీఎన్‌రెడ్డి డివిజన్‌ : టీఆర్‌ఎస్‌ 10, బీజేపీ
గాంధీనగర్‌ డివిజన్‌ : బీజేపీ 7, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
భోలక్‌పూర్‌ డివిజన్‌: బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1