Getup Seenu: సాయం చేయమని వేడుకుంటున్న జబర్దస్త్ కమెడియన్.. ఎంత కష్టం వచ్చిందో పాపం!

Seenu: వెండితెర సెలబ్రిటీలతో పాటు బుల్లి తెర పై ఉన్న నటీనటులు ఒకవైపు వారీ నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే మరొకవైపు వారికి తోచిన విధంగా తమవంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆపరేషన్ కు డబ్బులు లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెర సెలబ్రిటీలు అయిన యాంకర్ రష్మీ , సుడిగాలి సుదీర్, గెటప్ శీను, అఖిల్ సార్థక్ లాంటివారు వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలోనే సహాయంగా వారికి తోచిన విధంగా సహాయం చేసి, వారి ఫాలోవర్ లను, అభిమానులను సహాయం చేయమని సెలబ్రిటీలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా లో గెటప్ శ్రీను ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాలని అని వేడుకున్నాడు. అందుకు సంబంధించి ఒక ఫోటో షేర్ చేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చాలా దారుణ పరిస్థితి లో ఉన్నాడని ఆ అబ్బాయి పేరు ఆనంద్. అతను వారం రోజుల కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడని, చికిత్స మేరకు దాదాపుగా నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందట, అతని కుటుంబం అంత డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది.

ఎవరైనా ఆర్థికంగా సహాయం చేసే దాతల పై ఆశలు పెట్టుకున్నారు అని తెలిపాడు. మన మానవత్వం ఒకటైతే ఒక ప్రాణాన్ని కాపాడిన తన కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అని వేడుకున్నాడు. అంతేకాకుండా గెటప్ శీను తాను సహాయం చేసిన విషయాన్ని కూడా చూపించారు. ఈ సందర్భంగా గాయపడిన వ్యక్తి కి గెటప్ శ్రీను 20 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన గూగుల్ ఫే స్క్రీన్ షాట్ ఫోటోని షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే గెటప్ శ్రీను ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తూనే అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నాడు. బుల్లితెర కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ శ్రీను. ప్రస్తుతం వెండితెరపై మంచి మంచి అవకాశాలతో దూసుకు పోతున్నాడు.