ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తీరును నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే . మోదీ ప్రసంగంలో ఆయన మొత్తం హిందీలో మాట్లాడారని, ఇండియాలో ప్రాచీన భాష అయిన తమిళం ఎందుకు మాట్లాడలేదని కుష్బూ ట్విటర్లో ప్రశ్నించారు. దీంతో కుష్పూ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. బీజేపీ నేతలు సహా మోదీ ఫాలోవర్స్ అంతా కుష్బూ పై నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కు మంది ప్రజలు మాట్లాడే భాషను ప్రధాని మాట్లాడితే..తమిళ్ లో మాట్లాడాలని అర్ధం లేని వ్యాఖ్యలు ఏంటని దుమ్మెత్తిపోసారు.
కుష్బూ చెప్పినట్లు చేసుకుంటూ పోతే మోదీ దేశంలో ఉన్న అన్ని భాషలను నేర్చుకుని మాట్లాడాలని..అప్పటికి ఆయన వయసు కూడా అయిపోతుందని కుష్బూ తీరును ఎండగట్టారు. దీంతో కుష్బూ కామ్ అయిపోయింది. తాజాగా ఈ నటిపై మరో నటి, కొరియోగ్రాఫర్, బిజేపీ సభ్యురాలు గాయత్రి రఘురామ్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. కుష్బూ ఓ బ్రోకర్ అంటూ తీవ్ర పదజాలంతో గాయత్రి వ్యాఖ్యానించింది. మోదీని అపహేళన చేస్తున్నారని గాయత్రి మండిపడింది. దీంతో ట్విటర్లో ఈ వార్ మరోసారి హైలైట్ అయింది.
కుష్బూ ప్రధాని గురించి అలా మాట్లాడకూడదని…ప్రతిగా గాయత్రి కూడా ఓ మహిళపై సహనం కోల్పోయి అలా స్పందించకూడదని నెటి జనులు సూచించారు. ఇద్దరు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడనుంత దూకుడు రాజకీయాల్లోకి చూపించకూడదని..ఇక్కడ తెలివైన గేమ్ ఆడాలంటూ కామెంట్లు పడుతున్నాయి.