Gautam Sawang : గౌతమ్ సవాంగ్‌కి కీలక పదవిని వైఎస్ జగన్ కట్టబెట్టారా.?

Gautam Sawang : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్, ఇటీవల బదిలీ అయిన విషయం విదితమే. ఆయనకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా గౌతమ్ సవాంగ్ వ్యవహరించారనే అభిప్రాయం వుంది.

సరే, అందులో రాజకీయ విమర్శ ఎంత.? అన్నది వేరే చర్చ. గౌతమ్ సవాంగ్‌కి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని బదిలీ చేయడమేంటని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇంతలోనే, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ నియమితులు కాబోతున్నారన్న వార్త బయటకు వచ్చింది. దాంతో, విపక్షాలు షాక్‌కి గురవుతున్నాయి.

కాగా, ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి విషయమై గౌతమ్ సవాంగ్ రిస్క్ చేయకపోవచ్చనే చర్చ కొత్తగా టీడీపీ అనుకూల మీడియా నుంచి తెరపైకొచ్చింది. ఆయనకు ఇంకా సర్వీస్ వుండగానే ఇలాంటి పని ఆయనెందుకు చేస్తారన్నది టీడీపీ అనుకూల మీడియా ప్రశ్న.

కేంద్ర సర్వీసులకు వెళ్ళాలని ప్రస్తుతం గౌతమ్ సవాంగ్ అనుకుంటున్నారట. అది సాధ్యమేనా.? అందుకు పరిస్థితులు వీలుగా వున్నాయా.? అన్నది ఆలోచించాల్సిన విషయమే.
కాగా, ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవీ కాలం ఐదేళ్ళు. ఇంకోపక్క, గౌతమ్ సవాంగ్‌కి మిగిలిన సర్వీసు కాలం ఏడాదిన్నరగా చెబుతున్నారు.