ఇటీవలే విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. 12 మంది మృత్యువాత పడటం… వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత జరిగిన అతి ప్రమాదరకమైన ఘటనగా చెప్పుకునే సన్నివేశం ఎదురైంది. అయితే ఇంకా విశాఖ ఘటన ప్రజలకు మర్చిపోక ముందే మరో పెను ప్రమాదం చోటు చేసుంది. ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడం..రసాయనాలు గాల్లోకి చిమ్మడంతో పరిస్థితి విషమంగా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఎలా చోటు చేసుకుంది? అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.
గుజరాత్ లో ని దహేజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ కంపెనీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే యంత్రాంగం స్పందించి అగ్నిమాపక ఇంజిన్లతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి శ్రమిస్తున్నారు. భారీగా పొగ కమ్మడం తో పాటు ప్రమాదరకమైన రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది. రసాయనాలు విష పూరితం కావడంతో దగ్గర్లోని గ్రామస్థులను ఖాళీ చేసి ఆసుపత్రికి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే ఘటనలో గాయాలు పాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అదిస్తున్నారు.
ఘటనలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇంకా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఒకేసారి రసాయన పరిశ్రమలలో పెలుళ్లతో కంపెనీ చుట్టు పక్కల ఉన్న గ్రామస్థులు బెంబేలెత్తిపో తున్నారు. అలాగే తమిళనాడు లోనూ ఇటీవల ఇలాంటి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర -రాష్ర్ట ప్రభుత్వాలు కంపెనీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల విషయంలో నిబంధలనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యరించాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.