గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరబోతున్నట్లు దాదాపు ఏడాది నుండి ప్రచారం జరుగుతూనే వుంది. మధ్యలో నాలుగైదు సార్లు ముహర్తం కూడా పెట్టుకున్న కానీ ఎందుకో కుదరలేదు. అయినా సరే గంటా పట్టు వదలని విక్రమార్కుడుగా ట్రై చేస్తూనే వున్నాడు. కొంచం ఆలస్యం కావచ్చు ఏమో కానీ వైసీపీ లో గంటా చేరటం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నెల 3 వ తేది గంటా కొడుకు రవితేజ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడనే మాటలు వినవచ్చాయి. కానీ ఎందుకో ఆగిపోయింది.
నిజానికి గంటా వైసీపీ లోకి రావటం విజయసాయి రెడ్డికి అసలు ఇష్టం లేదు. అందుకే ఇన్ని రోజుల నుండి అడ్డం పడుతూ వచ్చాడు. అయితే గంటా చేస్తున్న లాబీయింగ్ దెబ్బకి విజయసాయి రెడ్డి కూడా చేసేది ఏమి లేక గంటా విషయం అధినేతకు వదిలేసి సైలెంట్ అయ్యాడు. సీఎం జగన్ ముందు కొన్ని ప్రతిపాదనలు వున్నాయి, వాటిపై నిర్ణయం ఆయనే తీసుకుంటాడు, ఎవరైనా వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని, అది తమ పార్టీ సిద్ధాంతం అని కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాజీనామా అనే మాట విజయసాయి రెడ్డి నోటి వెంట వచ్చిందంటే.. గంటా ఆల్రెడీ రాజీనామాకు సిద్ధమైపోయారనే విషయం దాదాపు ఖరారైనట్టే. ఇప్పటికే టీడీపీ నుండి నలుగురు జనసేన ఏకైక ఎమ్మెల్యే వైసీపీ కి మద్దతు ఇస్తున్నారు కానీ, రాజీనామా చేయలేకపోయారు, కానీ గంటా మాత్రం ఏకంగా రాజీనామా చేసి మరి పార్టీ మారటానికి సిద్దమైనట్లు వుంది.
గంటా రాజీనామా ఆమోదం పొందితే తిరుపతి ఉప ఎన్నికలు జరిగే సమయంలోనే ఈ ఎన్నిక కూడా ఉండవచ్చు, ఎలాగూ తిరుపతిలో వైసీపీ కి సానుభూతి ఉంటుంది కాబ్బటి, దాని ప్రభావంతో ఈజీగా బయటపడవచ్చు అనే ఆలోచనలో గంటా శ్రీనివాస రావు ఉన్నట్లు తెలుస్తుంది. గంటా దగ్గర గొప్ప లక్షణం ఏమిటంటే తాను ఎన్ని పార్టీలు మారిన కానీ, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా తాను ఉంటున్న పార్టీ తన సొంత పార్టీయే అన్నట్లు కలిసిపోతాడు, ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే వైసీపీ కూడా తన సొంత పార్టీ అనే ఫీలింగ్ వస్తుంది, అలా కాకుండా బయట నుండి మద్దతు ఇస్తే తాను అనుకున్న పనులు జరగవని గంటా తెలుసు అందుకే ఏకంగా రాజీనామాకు సిద్ధం అయ్యాడని చెపుతున్నారు.