గంటా అధికారికంగా టీడీపీకి వీడ్కోలు పలికాడని చెప్పడానికి ఇదిగో ప్రూఫ్

YS Jagan master plan with Ganta Srinivasa Rao

2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితిని చూసి టీడీపీ నుండి గెలిచిన అతికొద్ది నేతలు కూడా పార్టీని వీడాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీలో చేరారు. వారిలో వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి నేతలు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కోసం పని చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం టీడీపీ నాయకుడైన గంటా శ్రీనివాస రావు కూడా వైసీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

అయితే ఆయన రాకను స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇంకా టీడీపీకి మాత్రం అధికారికంగా వీడ్కోలు పలకలేదు. కానీ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చూస్తే ఆయన టీడీపీకి అధికారికంగా వీడ్కోలు పలికినట్టు తెలుస్తుంది.

కొన్నిరోజుల క్రితం విశాఖలో టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ మధ్య ఆ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ ప్రెసిడెంట్ల పదవులను అందుకున్న వారి ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. విశాఖ జిల్లాలోని ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. అయితే ఇంత పెద్ద ఫంక్షన్ కు విశాఖలో టీడీపీకి ఉన్న అతిపెద్ద నాయకుడైన గంటా శ్రీనివాసరావు మాత్రం హాజరు కాలేదు.

ఆయన హాజరు కారని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ఆయన ఇంత పెద్ద కార్యక్రమానికి వెళ్లకపోవడంతో ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీకి అధికారికంగా వీడ్కోలు పలికారని తెలుస్తుంది. ఇన్నిరోజులు ఆయన వెళ్ళాడేమోనని అనుకున్న వాళ్లకు ఈ ఘటనతో ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీలోకి వెళ్లనున్న గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తారో లేక వల్లభనేని వంశీ లాగా టీడీపీ రెబల్ గా ఉంటూ వైసీపీ పాట పాడుతారో వేచి చూడాలి.