Ganta Has No Connection : ఫాఫం నారా చంద్రబాబునాయుడు. పార్టీ అధినేత అన్న పేరే తప్ప, అధినేత హోదాలో పార్టీకి చెందిన ముఖ్య నేతల్ని తన దగ్గరకు రప్పించుకోలేకపోతున్నారు.. వారిని తన చెప్పు చేతల్లో పెట్టుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిందే ముక్కీ మూలిగీ 23 మంది. అందులో కొందరు ఇప్పటికే టీడీపీని వీడారు.
గంటా శ్రీనివాసరావు అయితే, గెలిచాక చంద్రబాబుకి మొహం చాటేశారు.. వేరే ఏ పార్టీలోకీ ఇంతవరకు దూకలేదు. టీడీపీలో వున్నారో లేదో.. గంటా అభిమానులకే తెలియని పరిస్థితి. తనను కలవాల్సిందిగా ఇటీవల చంద్రబాబు, గంటా శ్రీనివాసరావుని ఆదేశించారుగానీ.. గంటా మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్ళింది లేదు.
గంటా (Ganta Has No Connection) ఇలా పార్టీ అధినేత ఆదేశాల్ని బేఖాతరు చేస్తున్నా, ఆయన్ని పార్టీ నుంచి మందలించడం లేదా బయటకు పంపడం వంటి చర్యలు చేపట్టే సీన్.. పార్టీ అధినాయకత్వానికి లేకుండా పోయింది.
ఇంకో ఏడాది ఎలాగోలా ఈ ‘సాగతీత’ నాటకం కొనసాగిస్తే, ఆ తర్వాత ఎన్నికల వాతావరణం వచ్చేస్తుందని బహుశా గంటా ఆగుతున్నట్టున్నారు. అయితే, గంటా శ్రీనివాసరావుకి ఏ పార్టీలోనూ ఎంట్రీ లభించడంలేదట. అదీ అసలు సమస్య. అలాగని ఆయన టీడీపీలో కొనసాగే పరిస్థితీ లేదు.
బీజేపీ మాత్రం గంటాని పిలుస్తోందట.. అయితే, గంటా మాత్రం, అటు వెళితే తనకు వచ్చే లాభమేంటని ఆలోచిస్తున్నారట. అదీ అసలు సంగతి.