Ys Jagan’s Comments : పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వైఎస్ జగన్ ‘గజదొంగ’ ఆరోపణ.!

Ys Jagan’s Comments : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్షాల మీద విరుచుకుపడ్డారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి గత కొన్నాళ్లుగా అస్సలు ఇష్టపడని వైఎస్ జగన్, ‘దత్తపుత్రుడు’ అని మాత్రం ఆయన మీద సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్.. వీళ్ళతోపాటు పచ్చ మీడియా అధిపతులందర్నీ ఒకే గాటన కట్టేసి ‘గజదొంగలు’ అనేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఈ వ్యవహారమిప్పుడు తెలుగునాట రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా.? అసూయతో రగిలిపోయేవారికి బీపీలు వచ్చి, త్వరగా టిక్కెట్ తీసుకుని పోతారని ముఖ్యమంత్రి స్థానంలో వుండి శాపనార్థాలు పెట్టొచ్చా.? అని చర్చించుకుంటున్నారు జనం.
సరే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపక్షాలు, టీడీపీ అనుకూల మీడియా మూకుమ్మడి రాజకీయ దాడి చేస్తున్న దరిమిలా ఆయన సహనం కోల్పోయి వుండొచ్చు.. అది వేరే సంగతి. సహనం కోల్పోతే పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయ్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
పైగా, గజదొంగలన్నమాట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాడి వుండకూడదు. ఎందుకంటే, అది వైసీపీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ‘గజదొంగ మాత్రమే రాజీనామా చేయలేదు.. మామూలు దొంగలంతా రాజీనామా చేశారు..’ అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సెటైర్ వేశారంటే, దానికి ఆస్కారమిచ్చింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.
‘డాష్ కింద ముప్ఫయ్ మూడు కేసులు పెట్టుకున్నోళ్ళు గజ దొంగలంటూ కామెడీ చేశారు..’ అంటూ టీడీపీ సహా ఇతర విపక్షాలు ఎదురుదాడికి దిగాయి.
వైఎస్ జగన్ సంయమనంతో వ్యవహరించడమే రాజకీయంగా ఆయన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది. సహనం కోల్పోతే.. రాజకీయంగా ఆయన స్థాయి దిగజారిపోతుందన్నది నిర్వివాదాంశం.