నాలుగో టెస్ట్: టాస్ గెలిచిన ఇంగ్లాండ్..మొదట బ్యాటింగ్!

నాలుగు టెస్ట్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటివరకు 2-1తో లీడ్‌లో ఉన్న టీమిండియా ఇక ఆఖరిది కూడా గెలిచి సిరీస్ పూర్తి అధిపత్యాన్ని చలాయించాలని చూస్తోంది. ఇక ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు కూడా మొదటి మ్యాచ్‌ తరహాలో అసాధారణ ప్రదర్శనతో సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. మూడో టెస్ట్ గెలుపుతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రేసులో భారత్ నిలవగా ఓటమితో ఇంగ్లాండ్ ఆ రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.ఆఖరి పోరుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి

England Won the Toss and Choose to Bat First

మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ పిచ్ కూడా స్పిన్ కు అనుకూలిస్తుందన్న వార్తలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో, తొలుత బ్యాటింగ్ అడ్వాంటేజ్ ని వినియోగించు కోవాలని ఇరు జట్లూ భావించగా, ఆ అవకాశం ఇంగ్లండ్ కు దక్కింది.

ఈ పిచ్ తొలుత బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని, ఆపై స్పిన్ కు సహకరిస్తుందన్న అంచనాతోనే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నట్టు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ వ్యాఖ్యానించగా, ఇంచుమించు తనది కూడా అదే అభిప్రాయమని కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను తుది జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపాడు. తమ స్పిన్నర్లు ఇంగ్లండ్ ను కట్టడి చేయగలరనే భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు.