Gorantla Madhav: 2019 ఎన్నికలలో హిందూపురం పార్లమెంట్ నుంచి గోరంట్ల మాధవ్ పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఇలా 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన 2024 ఎన్నికలలో కనీసం టికెట్ కూడా పొందలేకపోయారు. ఇలా 2024 ఎన్నికలలో వైకాపా పార్టీ కూడా ఘోరంగా ఓటమిపాలు కావడంతో గోరంట్ల మాధవ్ కు తిరిగి హిందూపురం ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం హిందూపూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న ఈయన తాజాగా మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వ పాలనపై వైసిపి నేతలు కార్యకర్తలు ఎదురు తిరగాలని తెలిపారు. అవసరమైతే అవతలి వాళ్ళని చంపాలి అంటూ కూడా ఈయన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయామంలో పాలన మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా ఉండేది అలాగే కూటమి ప్రభుత్వంలో మాత్రం మూడు రే**, ఆరు మర్డర్డు అన్నట్టుగా పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్ ఇస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
ఈరోజు అమాయకుడైన కురుబ వీరన్న అనే వ్యక్తిని దారుణంగా చంపారు. ఆరుగురు పిల్లలు ఉన్నటువంటి ఈయనని చంపి కడుపుకోత మిగిల్చారు అంటూ గోరంట్ల మాధవ్, కూటమి నేతలకు అలాగే కూటమిపాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. దయచేసి ఇలాంటి హత్యలను ఆపివేయాలని లేకపోతే యువతల వాళ్లు కూడా ఆత్మ రక్షణ కోసం చేతిలో ఏ ఆయుధం ఉంటే దానితో అవతలి వారిని చంపి మనల్ని మనం రక్షించుకోవాలి అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.