బీజేపీ.. ప్రస్తుతం ఈ పార్టీ కన్ను ఏపీ మీద పడింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీలో దూకుడు మీదుంది పార్టీ. ముఖ్యంగా టీడీపీని దెబ్బ తీస్తోంది బీజేపీ. అధికార పార్టీ వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు నెరుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీని పెద్దగా టచ్ చేయకున్నా.. టీడీపీ మీద దృష్టి పెట్టింది. ఏపీ బీజేపీ నాయకులు కూడా టీడీపీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ముందు ఏపీలో టీడీపీ పార్టీని నామరూపం లేకుండా చేయాలనేది బీజేపీ ప్లాన్. దాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తుందా? అన్న నమ్మకం అయితే పార్టీ నాయకుల్లో లేదు. అందులోనూ చంద్రబాబు తర్వాత ఆ పార్టీని అదే రేంజ్ లో నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడైతే ఆ పార్టీలో లేడు. దీంతో పార్టీ భవిష్యత్తు శూన్యంగా మారింది.
దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీడీపీ ఓటుబ్యాంకును తమ వైపుకు తిప్పుకోగలిగితే… టీడీపీలోని ముఖ్యులను తమ పార్టీలో చేర్చుకుంటే.. వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ పుంజుకునే చాన్స్ ఉంది. అందుకే.. ముందు టీడీపీని ఖాళీ చేయడం కోసం.. టీడీపీ ముఖ్యలపై కన్నేసింది.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. ఇలా టీడీపీకి చెందిన నాయకులను తమ పార్టీలోకి కలిపేసుకోవడం ప్రారంభించింది. వాళ్లతో సంప్రదింపులు కూడా జరుపుతోంది.
సోము వీర్రాజు కూడా చాలా దూకుడు మీదున్నారు. టీడీపీని టార్గెట్ చేసి.. టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నాయకులు బీజేపీలో చేరారు. అలాగే.. టీడీపీ మాజీ మంత్రి ఒకరు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. ఆయన ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నా… ఆయనది విజయనగరం అని మాత్రం తెలుస్తోంది. త్వరలోనే ఆ మాజీ మంత్రి తన అనుచరులతో సహా.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారట. ఇలా రోజురోజుకూ బీజేపీ స్ట్రాంగ్ అవుతూ… టీడీపీని దెబ్బ తీస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. అదే చంద్రబాబు పాలిన శాపంలా మారుతోంది. చూద్దాం.. భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో?