VSR : వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల తన రాజకీయాలకు రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే తాను తన వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నాను అంటూ ఈయన తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ కు అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు కూడా అందజేశారు. ఈ విధంగా ఈయన రాజీనామా చేయటంతో ఏ పార్టీలో కైనా వెళ్తారా అనే సందేహాలు కూడా అందరిలోనూ ఉన్నాయి కానీ ఈయన ఏ పార్టీలోకి చేరనని క్లారిటీ ఇచ్చారు.
ఇక విజయ సాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్లోని లోటస్ పాండ్ లో షర్మిల తో భేటీ అయ్యారని దాదాపు మూడు గంటలపాటు వీరిద్దరూ ఏపీ రాజకీయాల గురించి చర్చించారని తెలుస్తోంది అయితే ఇప్పటివరకు ఈ భేటీ గురించి ఎక్కడ ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇదిలా ఉండగా విజయసాయి రెడ్డి రాజకీయాలకు రాజీనామా చేసినప్పటికీ తరచు రాజకీయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ ఫోటోలను స్వయంగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం విశేషం. ఇలా వీకెండ్ సందర్భంగా అలేఖ్య కుటుంబ సభ్యులతో విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఎంతో సరదాగా గడిపినటువంటి ఫోటోలను ఈమె షేర్ చేస్తూ వీకెండ్ విత్ విఎస్ఆర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి స్వయంగా విజయసాయిరెడ్డి భార్య సోదరి కుమార్తె కావటం విశేషం వరుసకు విజయసాయిరెడ్డి తనకు పెదనాన్న అవుతారు. అయితే తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మరణించినప్పుడు అలేఖ్య రెడ్డి కుటుంబానికి అన్ని తానే సాయి రెడ్డి వ్యవహరించారు. అప్పుడప్పుడు అలేఖ్య కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉంటారు. ఇక ఈయన రాజకీయాలకు రాజీనామా చేయటంతో తన ఫ్యామిలీతో ఇలా సరదాగా గడుపుతున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల ఈయన విదేశీ పర్యటన కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కూడా అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే.