పవన్ కల్యాణ్ ని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి?? – కథలో భారీ ట్విస్ట్ !

కొత్తతరమైన రాజకీయాలు చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న పవన్ కళ్యాణ్ నివార్ తుఫాన్ లో నష్టపోయిన రైతుల కోసం పోరాడుతున్నారు. నివార్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే కృష్ణ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు రాకపోయినప్పటికి పవన్ ముందుకు వెళ్లి రైతుల పక్షాన నిలబడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం వైసీపీ నేతలను కంగారు పెడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే తండ్రి ఒకరు పూర్తి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ తో ముందుకు నడుస్తున్నారు.

pawan kalyan janasena
pawan kalyan janasena

ఎవరా ఎమ్మెల్యే తండ్రి??

వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ రెడ్డయ్య పవన్ తో పాటు రైతుల కోసం సభలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్ని తప్పులని, రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని రెడ్డయ్య మండిపడ్డారు. ఈ ఘటన ఇప్పుడు వైసీపీ నేతలను కలవరపెడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే యొక్క తండ్రి ఇలా వైసీపీపై విమర్శలు చెయ్యడం పార్టీకి మంచిది కాదని భావిస్తున్నారు.

రెడ్డయ్యకు వైసీపీ అంత కోపమా!!

గతంలో ఎంపీగా విధులు నిర్వహించిన రెడ్డయ్యకు వైసీపీపై ఎందుకంత కోపం. వచ్చిందని, అదంతా నిజంగా రైతుల కోసమేనా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే ఆయన కొడుకు పార్థసారథి మీద పైన కోపమే వైసీపీపై కోపంగా మారిందని, గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి పడటం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా రెడ్డయ్య బయటకు వచ్చి మాట్లాడటం వల్ల రైతులకు మంచి జరుగుతుందేమో చూద్దాం.