AP: ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మది సీనియర్ నాయకులు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సింగనమల మాజీ మంత్రి శైలజనాథ్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు అయితే ఈయనతో పాటు మరికొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇలా సీనియర్ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని పొందలేదనే చెప్పాలి. మరి కాంగ్రెస్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్న నేతలు ఎవరు అనే విషయానికి వస్తే…మాజీ ఎంపీ హర్షకుమార్. గత రెండు నెలలుగా ఆయన జగన్‌కు మద్దతుగా, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వాన్ని సమర్ధించేలా హర్షకుమార్ ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. ఈ పరిణామాన్ని బట్టి, వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
అతి త్వరలోనే హర్ష కుమార్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరబోతుతారని స్పష్టమవుతుంది. ఈయనతో పాటు మరో సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా జగన్ చెంతకు రాబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలి అంటే తన తండ్రి హయామంలో మంత్రులుగా పనిచేసిన వారందరినీ కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తూ తిరిగి పార్టీని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమవుతుంది.