గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో.. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థను కించపరిచేలా విధంగా వైసీపీకి చెందిన పలువురు నేతలు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం పట్ల సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో ఒకరైన వైసీపీ నేత, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను సీబీఐ విచారణకు హాజరు కావాలి అని కోరడంతో.. ఆయన హాజరు కాలేకపోయారు. ఆయన ముందే నిర్ణయించుకున్న ప్రకారం పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది అని.. విచారణకు హాజరయ్యే ముందు తనకు సమయం కావాలని.. వారం గడువు ఇస్తూ విచారణ కు రాగలనంటూ కోరడంతో.. ఆయన విజ్ఞప్తికి సీబీఐ అధికారులు గడువు మంజూరు చేశారు.