చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేసీఆర్ కుట్ర పన్నారంటున్న మాజీ మంత్రి..

బీజేపీ నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తాజాగా నిర్వహించిన అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన అనే సభలో పాల్గొన్నారు. దీంతో అక్కడి మీడియా సమావేశంలో ఆయన కొన్ని విషయాలు బయట పెట్టాడు. కేసీఆర్ 2001 ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని అన్నాడు.

బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తో కలిసి ఎమ్మెల్యేలను సంప్రదించారని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఒకటయ్యారు అని అన్నారు. 61 వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారని.. ఆయన స్వయంగా వెళ్లి చంద్రబాబు కు సమాచారం ఇచ్చారు అని తెలిపారు.