తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము సంభాషించారు. ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ కూడా తన మద్దతును ఎన్డీయే అభ్యర్థికి ప్రకటించారు.
ఇక ద్రౌపది ముర్ము నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి సంతకాలు కూడా చేశారు. ఇక ముర్ము అన్ని రాష్ట్రాల్లో పర్యటన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఆమె మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ గురించి వారిద్దరు చర్చలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మద్దతు విషయంలో జగన్ కు కృతజ్ఞతలు కూడా తెలిపిందని తెలిసింది.