ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ కోసం కొరటాల ఫస్ట్ టైం రూల్ బ్రేక్ చేసి కథ చేశాడా??

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ స్థాయి మాస్ క్రేజ్ ఉన్నటువంటి హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు.. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు తన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో నేషనల్ వైడ్ మంచి క్రేజ్ ను తెచ్చుకోగా దీని తర్వాత అయితే దర్శకుడు కొరటాల శివతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తాను చేయబోతున్నాడు. 

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై చివరి వారం నుంచి స్టార్ట్ అవ్వనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కథపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పలు ఆసక్తికర గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం అయితే ఈ సినిమాకి కొరటాల సరికొత్త కథని తయారు చేసాడట. 

అందులోని తన గత చిత్రాలకు మల్లె సందేశం లాంటిది ఏం పెట్టలేదట. దీనితో తన సినిమాల మెసేజ్ రూల్ ని ఈ సినిమాని బ్రేక్ చేసినట్టుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. దీనితో ఒక పూర్తి మాస్ సినిమాని మాత్రమే కొరటాల తీస్తున్నాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతానికి అయితే ఇంకా హీరోయిన్ ఎవరు అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతమ్ అందిస్తుండగా కళ్యాణ్ రామ్ మరియు యువ సుధా బ్యానర్ వారు భారీ పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.