Devotional: అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ధరిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Devotional: మన హిందూ సంప్రదాయాల ప్రకారం చాలా మంది మహిళలు అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పిస్తూ ఉండటం మనం చూస్తుంటాము. అయితే ఇలా అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను తిరిగి తీసుకు వచ్చి మహిళలు ధరిస్తూ ఉంటారు. అదే విధంగా మరి కొన్ని ఆలయాలలో అమ్మవారీ వస్త్రాలను వేలం పాటలో భక్తులు ఆ వస్త్రాలను దక్కించుకుని అమ్మ వారి ప్రసాదం గా భావిస్తారు.అయితే ఇలా అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను తీసుకుని మహిళలు ధరించడం వల్ల అంతా శుభం కలుగుతుందని భావిస్తారు.

కానీ అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ధరించే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చీరలను ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు.కేవలం ఏదైనా పూజా కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో మాత్రమే అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ధరించాలి. అలాగే ఈ చీర కట్టుకున్న అనంతరం వాటిని శుభ్రంగా ఉతికి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడి వేయాలి.

అయితే ఒకసారి ఈ చీరలు కట్టుకున్న తర్వాత కేవలం పూజ పూర్తయ్యే వరకు మాత్రమే కట్టుకుని అనంతరం మార్చుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ చీరలు ధరించి పొరపాటున కూడా పడకగదికి వెళ్ళకూడదు. కేవలం అమ్మవారికి సమర్పించిన చీరల విషయంలో మాత్రమే కాకుండా మనం ఎవరింటికైనా పూజా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వారి తాంబూలంతో పాటు ఇచ్చే రవికల ఈ విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు.