ఇదెక్కడి విచిత్రం బాబోయ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా చేపను ఇచ్చారు..

fish selected for man of the match in cricket

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంటే ఎవరికి ఇస్తారు. ఆ మ్యాచ్ లో ఆడిన ఆటగాళ్లలో ఉత్తమ ఆటగాడికి ఇస్తారు. అయితే అవార్డు అంటే ఏదైనా షీల్డో లేదా పతకమో ఏదో ఒకటి ఇస్తారు కానీ.. ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా చేపను ఇచ్చారు.

fish selected for man of the match in cricket
fish selected for man of the match in cricket

అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులో చేప ఎక్కడి నుంచి వచ్చింది. చేపను ఎందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోసం పెట్టుకున్నారు.

ఈ విచిత్రం కశ్మీర్ లోని తెకిపూరా కుప్వారాలో జరిగిన క్రికెట్ లీగ్ లో చోటు చేసుకున్నది. రెండున్నర కిలోలు ఉన్న చేపను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గెలిచిన ఓ ప్లేయర్ కు అందించారు.

దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను కశ్మీర్ కు చెందిన ఓ జర్నలిస్టు తన ట్విట్ఱర్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి ఇలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చేపను ఇవ్వడం క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి కాబోలు. అయితే.. ఈ క్రికెట్ లీగ్ ను ఫేమస్ చేయడం కోసమే.. ఇలా వినూత్నంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా చేపను బహుకరించి ఉంటారని కామెంట్లు వస్తున్నాయి. లేదంటే ఆ క్రికెట్ లీగ్ ను నడిపించడం కోసం ప్లేయర్ల దగ్గర డబ్బులు లేక అలా చేపను ఇచ్చారేమో? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా.. చేపను అవార్డుగా ఇచ్చి.. అందరి చూపును తమవైపు తిప్పుకున్నారు ఆ క్రికెటర్లు.