నేటి జనరేషన్ కు డిప్రెషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ కు లోనవుతుంటారు. ఆ డిప్రెషన్ వల్ల తమ జీవితాలను కూడా ఒక్కోసారి నాశనం చేసుకుంటారు. ప్రాణాలు కూడా తీసుకుంటారు. డిప్రెషన్ వస్తే.. దాని నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచించాలి కానీ.. ప్రాణాలు తీసుకుంటే వచ్చేదేం ఉండదు. అందుకే.. డిప్రెషన్ వస్తే ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా డిప్రెషన్ తో బాధపడేవాళ్లు ఒంటరిగా ఎక్కువగా ఉండకూడదు. ఒంటరితనంతో డిప్రెషన్ ఇంకా ఎక్కువవుతుంది కానీ తగ్గదు.
డిప్రెషన్ తో పాటుగా.. ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, ఆందోళన ఎక్కువవుతున్నా.. చేపలను ఎక్కువగా తినాలి. అవును.. డిప్రెషన్ తో బాధపడేవాళ్లు చేపలను ఎక్కువగా తీసుకుంటే డిప్రెషన్ పరార్ అవుతుందట. చేప అంటేనే యాంటీ డిప్రెసెంట్. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ తో అది పోరాడుతుంది. ఆందోళనను మటుమాయం చేస్తుంది.
చేపల్లో ఎన్ని ప్రొటీన్లు ఉంటాయో తెలుసు కదా. చేప ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కనీసం వారానికి ఒకసారైనా చేపలను తినాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అయితే.. చేపలను తినడం వల్ల ఆరోగ్యం లభించడంతో పాటుగా… దానిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డీ వల్ల డిప్రెషన్ తగ్గుతుందట. మానసిక సమస్యలతో బాధపడేవాళ్లు కూడా చేపలను ఎక్కువగా తీసుకుంటే కొంత వరకు రిలీఫ్ ఉంటుంది.
అంటే చేపలను తరుచూ తింటే.. ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఆనందంగా ఉంటాం అన్నమాట.