ఫస్ట్ డే ఫస్ట్ షో తెలుగు మూవీ రివ్యూ

నటీనటులు:  శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సివిఎల్ నరసింహారావు, ప్రభాస్ శ్రీను, మహేష్ ఆచంట

దర్శకుడు: వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి

నిర్మాతలు: శ్రీజ ఏడిద, శ్రీరామ్ ఏడిద

సంగీతం: రాధన్

చాలా మంది అంతగా పరిచయం లేని ఆర్టిస్ట్ ల తో వచ్చిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకు ముందునుంచే కొంచం హైప్ వచ్చింది. చిరంజీవి ఈ సినిమా ప్రీ-రిలీజ్ కి రావడం, అలాగే ‘జాతిరత్నాలు’ సినిమా డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాకు స్టోరీ అందించడం వల్ల ఈ సినిమాకు కావలసిన బజ్ అయితే వచ్చింది. వైష్ణవ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో బాటు ఈ రోజు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఎలా ఉందొ చూద్దాం.

కథ:

ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ కి వీరాభిమని. ఎలాగైనా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమాని ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడటమే అతని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న ఒక నిర్లక్ష్యపు వ్యక్తి. మనోడు లయ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు,

అయితే ఆ అమ్మాయి కూడా హీరో ని ‘ఖుషీ’ సినిమాకు ఫస్ట్ డే టిక్కెట్లు కావాలని అడుగుతుంది. కానీ కిక్కిరిసిన జనం కారణంగా అతను టికెట్స్ దొరకవు. దీంతో ఎలాగైనా ఫస్ట్ డే ఫస్ట్ టికెట్స్ సంపాదించాలి అని కంకణం కట్టుకుంటాడు , చివరకు, మన హీరో ప్రేమను గెలుస్తాడా? లేదా? తన అనుకున్న గోల్ రీచ్ అవుతాడా అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉంది:

ఈ సినిమాలో కూడా ‘జాతిరత్నాలు’ లాగా కథ లేదు, ఈ సినిమాలో సంబంధం లేని కామెడీ మాత్రమే మనకు కనిపిస్తుంది, ఒక వేల మీరు కథ గురించి పట్టించుకోకపోతే ఈ సినిమాను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఒక స్టార్ హీరో సినిమాకు మొదటి రోజు థియేటర్‌ల దగ్గర ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇది మూవీ లవర్స్ కి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, తరువాత కథ ఒక రొటీన్ ప్రేమకథగా మారింది. ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ బ్లాక్‌లు తప్ప పెద్ద గా ఎంటర్టైన్ చేసే అంశాలు ఏమీ లేదు.

రొటీన్ స్క్రీన్‌ప్లే తో బాటు, క్లైమాక్స్ మరీ సిల్లీగా అనిపించడంతో కథకు ఏమాత్రం ఉపయోగపడని అదే హాస్య సన్నివేశాలతో సెకండాఫ్ ఉంటుంది.

ఓవరాల్ గా, ‘ఫస్ట్ డే ఫస్ట్’ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ పాక్షికంగా బాగుంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రాధన్ ఆకట్టుకున్నాడు. స్టోరీ ని పక్కనపెట్టి, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కేవలం లాజిక్ లేని కామెడీ కోసమే చూడాల్సిన సినిమా.