Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లులో టాలీవుడ్ డైరెక్టర్.. అలాంటి పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారుగా!

Hari Hara Veera Mallu: టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీబిజీ అవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో నిదినిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. విలన్ గా బాబీ డియోల్ కనిపించనున్నాడు.

వీరితో పాటు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీకి మరొక రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఈ పీరియాడికల్ మూవీ నుంచి తార తార అనే లిరిక్స్ తో సాగే పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో పవన్, నిధిల స్టెప్పులు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Taara Taara - Lyrical| HariHaraVeeraMallu |PSPK| Nidhhi | MM Keeravaani | AM Rathnam| Jyothi Krisna

అయితే ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ డైరెక్టర్ అనూహ్యంగా మెరిశాడు. దాంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ డైరెక్టర్ తదేకంగా చూస్తే తప్పక గుర్తుపట్టలేరు. ఈ డైరెక్టర్ నటుడిగా మెరవడం ఇదేమీ మొదటి సారి కాదు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా, అలాగే ఇటీవల రిలీజైన మ్యాడ్ 2 మూవీలోనూ క్యామియో రోల్స్ లో కనిపించాడు. ఇప్పుడు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హరి హర వీర‌మ‌ల్లు సినిమాలో కూడా మెరిశాడు. ఇందులో ఈ డైరెక్టర్ గెట‌ప్ కూడా విచిత్రంగా ఉంది. బాగా ఫోక‌స్ చేసి చూస్తే త‌ప్ప అతనిని గుర్తు పట్టలేం. అతనెవరో కాదు జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్. కాగా అనుదీప్ ఈ పాటలో ఒకటే మెరిసేరా లేకపోతే సినిమా మొత్తం ఉన్నారా అన్నది తెలియాలి అంటే జూన్ 12 వరకు వేచి చూడాల్సిందే మరి.