క్రేజీ డైరెక్టర్ తో విశ్వక్ సేన్ కొత్త సినిమా.. టైటిల్ ఏంటంటే!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కాంబినేషన్ లో ఒక మూవీ అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్ తన 14వ చిత్రంగా ఈ సినిమాని అనౌన్స్ చేశారు. హై ఎనర్జీ పెర్ఫార్మన్స్ లో అదరగొట్టే హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ దిట్ట. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అవుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

ఎప్పుడూ మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టే విశ్వక్ సేన్ ఇప్పుడు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారంట. తొలిసారి విశ్వక్ సేన్ ఈ సినిమా ద్వారా కామెడీ జోనర్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి ఫంకీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర సరికొత్త పంధా లో ఉంటుందని, చక్కని హాస్యంతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాని సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూవీ టైటిల్ లాంచింగ్ ఈవెంట్లో దర్శకుడు అనుదీప్, హీరో విశ్వక్ సేన్ ఇంకా నిర్మాతలు పాల్గొన్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చేయడాదే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ తీస్తున్న సినిమా కావటంతో ఫంకీ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక విశ్వక్సేన్ విషయానికి వస్తే ప్రస్తుతం అతను లైలా అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ లో ఆయన లేడీ గెటప్ లో కనిపిస్తారు. విశ్వక్సేన్ మరో కొత్త సినిమా కల్ట్. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కాబోతుంది.