ఓ సినిమాకి గుమ్మడికాయ మరో సినిమాకి కొబ్బరికాయ.. విశ్వక్ సేన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

నవంబర్ 22న విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీగా థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించగా రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో ఉన్న సినిమాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే, అతని ప్లానింగ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఒక సినిమాకి గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం మరొక సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నాడు ఈ హీరో. ఏ స్టార్ హీరోకి తీసిపోకుండా దాదాపు 6 సినిమాలు అతని చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో మొదట లైలా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటిస్తున్నట్లు సమాచారం.

ఇది కాకుండా జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అంతేకాకుండా సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీధర్ గంటను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమా స్టార్ట్ చేస్తాడు విశ్వక్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కన్నడ నటి సంపద ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాంతారా సినిమా ఫేమ్ అజినేష్ సంగీతం అందిస్తున్నారు. ఇవన్నీ కాకుండా దాస్ కా దమ్కీ కి మరొక పార్ట్ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు విశ్వక్ సేన్.

కల్ట్ సినిమాని మార్చిలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం, అలాగే ఏమైంది ఈ నగరానికి 2 సినిమా రైటింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మెకానిక్ రాఖీ సినిమా గురించి మాట్లాడుతూ గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ని టచ్ చేసాము అది స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.