‎Priyadarshi: జాతిరత్నాలు 2 నేను చేయను.. సినిమాలో నటించను.. కమెడియన్ ప్రియదర్శి కామెంట్స్ వైరల్!

Priyadarshi: జాతి రత్నాలు సినిమా గురించి మనందరికి తెలిసిందే. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇందులో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కడుపుబ్బా నవ్వాల్సిందే.

‎ఇకపోతే కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా జాతిరత్నాలు 2 కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు డైరెక్టర్ అనుదీప్. అయితే తాజాగా జాతిరత్నాలు 2పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు కమెడియన్ ప్రియదర్శి. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు విజయేందర్ తెరకెక్కిస్తున్నారు.
‎ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‎ అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియదర్శి జాతిరత్నాలు 2లో నేను చేయను అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాతిరత్నాలు2 సినిమా తీస్తే నేను మాత్రం అస్సలు చేయను. అలాంటి క్లాసిక్‌ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ, నేను మాత్రం ఆ సినిమాలో నటించను అని తెలిపారు. అనంతరం తాను నటిస్తున్న మిత్ర మండలి సినిమా గురించి మాట్లాడుతూ. ఈ సినిమా కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేసింది. జాతిరత్నాలు సినిమాకు మించి మీరు ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.. దీంతో ఈ సందర్బంగా ప్రియదర్శి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.