Crime News: అర్ధరాత్రి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు..!

Crime News: ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల
ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఔషధాల తయారీలో వాడే పొడిని ఈ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఫ్యాక్టరీ నాలుగో యూనిట్ లో భారీగా శబ్ధం వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు ఉన్నారు. మంటల్లో చిక్కుకొని ఆరు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చక్కెర కర్మాగారాన్ని రసాయన కర్మాగారం గా మార్చి సరైన ప్రమాణాలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు యజమాన్యం మీద మండి పడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిన కూడా యాజమాన్యం ఏ విధంగా స్పందించలేదు.

ఈ ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కార్మికులు పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్నారు. కెమికల్ పరిశ్రమ అక్కడినుండి మార్చాలి అని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు, తక్కువగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు.