Prashanth Kishore : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేతులెత్తేశాడహో.!’

Prashant Kishor Hands-UP

Prashanth Kishore Hands-UP : దేశంలో చాలా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్, ఐ ప్యాక్ ద్వారా ఆయ రాజకీయ పార్టీల గెలుపు కోసం ప్రయత్నించిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఆయా రాజకీయ పార్టీలకు అద్భుత విజయాల్ని కూడా అందించాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు లేకుండా ఆయా రాజకీయ పార్టీలు అంతటి విజయాలు అందుకునేవా.? అంటే, లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.

అంతా బాగానే వుందిగానీ, సొంత రాజకీయ పార్టీ పట్టుకుని ప్రశాంత్ కిషోర్ తనను తాను రాజకీయంగా ఉద్ధరించుకోవచ్చు కదా.? అన్న ప్రశ్నకు సమాధానమెవరిస్తారు.? ఆయనకీ ఆ రాజకీయ దురద వుంది. కాకపోతే, తన వ్యూహాలు తనకు పనికొస్తాయా.? లేదా.? అన్నదానిపై ఆయనకీ కొంత అనుమానం వుంది.

ఇక, బీహార్ కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ప్రశాంత్ కిషోర్, ఆ దిశగా తెరవెనుకాల చాలా సన్నాహాలు చేసుకున్నారుగానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లే కనిపిస్తోంది. బీహార్ రాష్ట్రంలో 3 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయబోతున్నారట. ఆ తర్వాత అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీని ప్రకటించాలా.? వద్దా.? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారట.

ఈ పాదయాత్ర కాన్సెప్ట్ బహుశా మిత్రుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రశాంత్ కిషోర్ తీసుకుని వుండాలి. ఓ వైపు తన రాజకీయ ఎదుగుదల గురించి వ్యూహాలు రచించుకుంటూ, ఇతర పార్టీల గెలుపు కోసం ఆయనెలా వ్యూహాలు రచించగలుగుతారట.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి తదితర పార్టీలకు ఆయన ప్రస్తుతం వ్యూహకర్తగా పని చేస్తున్నారు.