Posani: నా భార్యను బండ బూతులు తిట్టారు… అందుకే నేను తింటాను… నిజం ఒప్పుకున్న పోసాని!

Posani: పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. హైదరాబాదులో తన నివాసంలో పోలీసులు పోసానని అరెస్టు చేసి న్యాయవాది ముందు హాజరు పరిచారు. అయితే వాదోపవాదనాలు విన్న తర్వాత పోసానిని 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పు రావడంతో ఆయనని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇక నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పెద్ద ఎత్తున వాదోపవాదనలు జరిగినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పవన్ అలాగే లోకేష్ పై ఈయన అనుచిత వ్యాఖ్యలు చేయడం గురించి జడ్జి ముందు పోసాని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి పోసాని మాట్లాడుతూ నేను తిట్టినటువంటి వీడియోని మాత్రమే ప్లే చేస్తున్నారు కానీ నా భార్యను వారంతా బండ బూతులు తిట్టారు కానీ అవన్నీటిని కట్ చేసి నేను తిట్టిన వీడియోని మాత్రమే వైరల్ చేస్తున్నారని తెలిపారు.

నా భార్యను అలా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ మాట్లాడటం వల్లే నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది అంటూ పోసాని నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని ముఖ్యంగా వైసిపి పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించారు. ఇలాతన రాజీనామాన్ని ప్రకటించిన నెల తర్వాత ఈయనని పోలీసులు అదుపులోకి తీసుకోవటం గమనార్హం.

ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఈయన 14 రోజుల తర్వాత తిరిగి బయటకు రానున్నారు అయితే ఈ లోగా వైసిపి లాయర్లు ఈయన బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక పోసాని కోసం జగన్ ఆదేశాల మేరకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.