Line Cleared For RRR Movie : బిగ్ అప్డేట్ : “RRR” సినిమాకి జగన్ ప్రభుత్వం భారీ హైక్..వివరాలు ఇవే.!

Line Cleared For RRR Movie

Line Cleared For RRR Movie : మరికొన్ని రోజుల్లో ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ కి సిద్ధం అవుతున్న భారీ సినిమాల్లో ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అన్ని ఇండస్ట్రీ వర్గాల్లో కూడ మంచి క్రేజ్ తో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఏపీలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త చిక్కులు తప్పలేదు.

ఈ కొత్త టికెట్ ధరలతో ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పదని ముందు నుంచీ స్ట్రాంగ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడిచింది. అందుకే ఈ సినిమా బిజినెస్ కూడా కాస్త తేడాగానే జరిగింది అని తెలిసింది. అయితే ఈ చిత్రం కి కొత్త ధరల విషయంలో మాత్రం రాజమౌళి అయితే ఇప్పటికీ పట్టు విడవలేదు.

కొత్తగా వచ్చిన జివో కూడా అంత రంజకమైన రేట్స్ తీసుకు రాకపోయే సరికి పైగా రాధే శ్యామ్ సినిమాకి కూడా పెద్దగా హైక్స్ ఇవ్వకపోవడంతో రాజమౌళికి మరింత టెన్షన్ పట్టుకుంది. దీనితో మళ్ళీ జగన్ ని కలవాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా రాజమౌళి తన సినిమాకి లైన్ క్లియర్ చేసేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకి గాను ఏపీ ప్రభుత్వం వారు ఏకంగా 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారట. ఇది హ్యుజ్ అని చెప్పాలి. అలాగే ఇది రెండు వారాల నుంచి 10 రోజులు మేర ఉండొచ్చని తెలుస్తుంది. అలాగే ఈ ధరలు హై క్లాస్ వరకు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మొత్తానికి అయితే ఈ సినిమాకి లైన్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పాలి. సో ఈ సినిమా వసూళ్లకు ఎలాంటి డోకా లేదని చెప్పాలి.