RRR : యూఎస్ బాక్సాఫీస్ లో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న “RRR” చిత్రం.!

RRR : ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందులోని వారిని మించి స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో అనౌన్స్ చేసిన భారీ సినిమానే ట్రిపుల్ ఆర్(RRR). ఈ ముగ్గురి కాంబో సినిమా అనగానే ఏ స్థాయి అంచనాలు ఉండాలో అంతే రేంజ్ అంచనాలు ఇప్పుడు ఈ సినిమాపై నెలకొన్నాయి.
భారీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అమెరికా నుంచి అనకాపల్లి వరకు కూడా హై లెవెల్లో అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ భారీ సినిమా ఆల్రెడీ రికార్డు స్థాయి బుకింగ్స్ ని యూఎస్ మార్కెట్ లో నమోదు చేసింది. ఆల్ టైం ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అదే స్పీడ్ లో దూసుకెళ్తుంది.
లేటెస్ట్ గా అయితే ఈ సినిమా 1.54 మిలియన్ డాలర్స్ ని హిట్ చేసిందట. అంతే కాకుండా తర్వాత 2 మిలియన్ డాలర్స్ ని కూడా ఈజీగా ఈ చిత్రం అందుకుంటుంది అని తెలుస్తుంది. దీనితో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తుంది అనే దానికి చిన్న శాంపిల్ అని మాత్రం చెప్పాలి.
మరి ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ల సరసన ఒలీవియా మోరిస్ మరియు ఆలియా భట్ లు నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.