D.S. Rao: చిన్న సినిమాలు తీయండి, చిన్న సినిమాలను బతికించండి.. అని అన్నారు. అలా దాసరి నారాయణ రావు గారు కూడా తీసి తీసి కొన్నిసార్లు ఇబ్బందులు పడి ఉంటారని ప్రముఖ నిర్మాత డీఎస్ రావు తెలిపారు. పెద్ద సినిమాలు తీస్తే ఆ కెరీర్, ఆ స్టేటస్ వేరే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు లెక్కలేనంత మంది చిన్న సినిమాలు తీశారన్న ఆయన, వాళ్ల పేర్లు మనం చెప్పుకోవట్లేదని ఆయన అన్నారు.
పెద్ద సినిమాలు తీస్తే డబ్బులు ఎక్కువొస్తాయని కాదు. కానీ ఒక పేరున్న హీరో లేదా ఒక గొప్ప కుటుంబమున్న నుంచి వచ్చిన వారితో తీస్తే పాపులారిటీ వేరేలా ఉంటుందని ఆయన చెప్పారు. తాను ఉదాహరణకు హీరో వెంకటేష్‌తో కలిసి ఒక సినిమా తీస్తే అప్పుడు వేరేలా ఉంటుందని ఆయన అన్నారు.
ఇకపోతే తనకూ, దిల్ రాజుకూ మధ్య పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ ఎలాంటి ఇష్యూస్ లేవని డీఎస్ రావు అన్నారు. అందరం ఫ్రెండ్స్‌లానే ఉంటామని, ఛాంబర్‌లో కూడా కలుస్తూ ఉంటామని ఆయన చెప్పారు. దిల్ రాజుతోనే కాదు తనకు ఇంకెవరితోనూ ఇండస్ట్రీలో శత్రువులు లేరని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తాను ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే సినిమా తీయొద్దనే చెప్తానని డీఎస్ రావు అన్నారు. ఎప్పుడూ టెన్షన్‌గానే ఉంటుందన్న ఆయన, అప్పటిదాకా నడిచి వచ్చిన వ్యక్తి కూడా సినిమా ఓకే చేశాక మాత్ర కారు కావాలంటారని, అందర్నీ భరించాలని ఆయన అన్నారు. అలవాటయ్యాక వేరే పని చెయ్యలేక సినిమా తీస్తుంటారని, సినిమా చూడడం ఆనందంగా చూస్తారు కానీ, అది తీయడం మాత్రం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారం అని ఆయన వివరించారు.